DNews: Dec13: దేశంలోనే రెండవ అతిపెద్ద నది అయిన గోదావరికి పుష్కర ఘడియలు వస్తున్నాయి. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాలకు ముహూర్తాన్ని నిర్ణయించే గెజిట్‌ను విడుదల చేసింది. పవిత్ర స్నానాలకు తేదీలను ప్రకటించింది. అతి పవిత్రమైన గోదావరమ్మకు ఉత్సవాలు జరుగుతాయి. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాలకు ముహూర్తం నిర్ణయించబడింది. 2027 గోదావరి పుష్కరాలకు తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది. టీటీడీ సలహాలు, సూచనలతో ముహూర్తం నిర్ణయించబడింది. 2027 గోదావరి పుష్కరాలకు ముహూర్తాన్ని ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయి. మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరుగుతాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ సందర్భంగా, 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని పుష్కరాలకు ముహూర్తం నిర్ణయించారు. టీటీడీ ఎండోమెంట్ శాఖ అభిప్రాయాలను ఏపీ ఎండోమెంట్ శాఖ ఆమోదించింది.. ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఏపీ ఎండోమెంట్ శాఖ కమిషనర్ లేఖ ద్వారా గోదావరి పుష్కరాలకు ముహూర్తం అధికారికంగా ఖరారు చేయబడింది. గోదావరి పుష్కరాలు ప్రధానంగా రాజమండ్రిలో జరుగుతాయి. పుష్కరాల కోసం దాదాపు రూ. 2,105 కోట్ల నిధులతో పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. పుష్కరాల నిర్వహణ కోసం మంత్రులు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది. ముహూర్తం ఖరారు కావడంతో, రాబోయే వర్షాకాలంలో గోదావరమ్మ పండుగ జరుగుతుంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇంకా గోదావరి పుష్కరాలపై ఇంకా దృష్టి పెట్టలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana