
D Spiritual: Dec 12: ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముద్రించిన 2026 నూతన సంవత్సరం క్యాలండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీవారి భక్తుల నుండి అనూహ్యమైన స్పందన వస్తోంది. భక్తులు సౌకర్యంగా పొందేందుకు టిటిడి ఈ సంవత్సరం విభిన్న రకాల క్యాలండర్లు, డైరీలను ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచింది. 12 పేజీల క్యాలండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలండర్లు 75 వేలు, పెద్ద డైరీలు 3.50 లక్షలు, చిన్న డైరీలు 3 లక్షలు, టేబుల్‌టాప్ క్యాలండర్లు 1.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలండర్లు 2.50 లక్షలు, పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలండర్లు 10 వేలు, శ్రీవారు–పద్మావతి అమ్మవారు క్యాలండర్లు 3 లక్షలు, టిటిడి స్థానిక ఆలయాల క్యాలండర్లు 10 వేలు ముద్రించారు.
తిరుమల, తిరుపతి ప్రాంతాలలోని టిటిడి పుస్తక విక్రయ కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక టిటిడి కేంద్రాల్లో కూడా ఈ క్యాలండర్లు, డైరీలు విక్రయించబడుతున్నాయి. భక్తుల సౌలభ్యం కోసం www.tirumala.org, TTD Devastanams, ap.gov.in ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో బుక్ చేసిన భక్తులకు తపాల శాఖ ద్వారా క్యాలండర్లు, డైరీలు డెలివరీ చేస్తారు. టిటిడి ఈఒ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ పంపించిన భక్తులకు కూడా టిటిడి క్యాలండర్లు, డైరీలు తపాల శాఖ ద్వారా పంపబడతాయి.
మరిన్ని వివరాల కోసం భక్తులు 0877–2264209 నంబర్‌ను సంప్రదించవచ్చని టిటిడి తెలిపింది.
