DSports Dec12, 2025: భారత మహిళా రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఎదురైన తీవ్ర నిరాశతో ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె, దాదాపు 18 నెలల విరామం తర్వాత తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆమె తదుపరి లక్ష్యం లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో దేశం కోసం పతకం సాధించడమే.

రిటైర్‌మెంట్ ప్రకటించిన సుదీర్ఘ విరామం తర్వాత.. వినేశ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

  • “పారిస్ ఒలింపిక్స్‌తో నా రెజ్లింగ్ జర్నీ ముగిసిందా అని ప్రజలు ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు చాలా కాలం పట్టింది. ఒత్తిడి నుంచి, అంచనాల నుంచి దూరంగా ఉండి… నా ప్రయాణంలోని భారాన్ని అర్థం చేసుకోవడానికి నేను సమయం తీసుకున్నాను.”
  • “ఆత్మపరిశీలనలో నాకు ఒక సత్యం తెలిసింది: నాలో ఆ పోరాట పటిమ (fire) ఇంకా ఆరిపోలేదు. అలసట, గందరగోళంలో అది కేవలం కప్పబడి ఉంది. క్రమశిక్షణ, దినచర్య, పోరాటం… ఇదంతా నా సిస్టమ్‌లో ఉంది. నేను ఎంత దూరంగా నడిచినా, నాలో ఒక భాగం మ్యాట్‌పైనే ఉండిపోయింది.”
  • “నేను ఇక్కడ ఉన్నాను. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ వైపుకు తిరిగి అడుగులు వేస్తున్నాను. ఈసారి నేను ఒంటరిగా నడవడం లేదు, నా కొడుకు నా జట్టులో చేరుతున్నాడు, అతనే నా అతిపెద్ద ప్రేరణ, నా చిన్నారి చీయర్‌లీడర్,” అని వినేశ్ భావోద్వేగంగా రాసుకొచ్చింది.

దీంతో ఎమ్మెల్యేగా తన బాధ్యతలు కొనసాగిస్తూనే, వినేశ్ ఫోగట్ మళ్లీ మ్యాట్‌పై సత్తా చాటడానికి సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. ఈ నిర్ణయం భారత క్రీడాభిమానులకు శుభవార్తగా నిలిచింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana