DSports Dec12, 2025: క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒక శుభవార్త అందించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ ధరలను ఊహించని విధంగా తగ్గించింది. ఈ ప్రపంచ కప్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, ఎంట్రీ-లెవల్ టికెట్ ధరను కేవలం రూ.100కు నిర్ణయించడం సంచలనంగా మారింది.

ఐసీసీ ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. మొన్నటి (డిసెంబర్ 11) సాయంత్రం 6:45 గంటల నుంచి మొదటి దశ టికెట్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) సంజోగ్ గుప్తా మాట్లాడుతూ.. “టికెట్ ధరలను కేవలం ₹100 నుంచి ప్రారంభించడం మా వ్యూహంలో కీలకం. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి అభిమానికి ప్రపంచ స్థాయి క్రికెట్ అనుభవాన్ని అందివ్వాలనేదే మా లక్ష్యం,” అని పేర్కొన్నారు.