DET:DEC 12:
బిగ్ బాస్ పాపులారిటీ వల్లే ఆయేషా ఖాన్ ఎంపిక కాలేదు దర్శకుడు అనూకల్ప్ గోస్వామి స్పష్టం:
కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 సినిమా విడుదలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఈ సినిమాలో హీరోయిన్లలో ఒకరైన ఆయేషా ఖాన్ ఎంపిక గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి.ముఖ్యంగా బిగ్ బాస్ 17 రియాలిటీ షోలో ఆమెకు వచ్చిన భారీ పాపులారిటీ మరియు సోషల్ మీడియా ఫాలోయింగ్‌ వల్లే ఆమెకు ఈ అవకాశం దక్కిందని చాలా మంది భావించారు.అయితే దీనిపై సినిమా దర్శకుడు అనూకల్ప్ గోస్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.ఆయేషా ఖాన్ ఎంపికకు బిగ్ బాస్ లేదా ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు.

పాత్రకు సరిపోయే నటి కోసమే వెతికాం:
ఆయేషా ఖాన్ ఎంపిక ప్రక్రియ గురించి దర్శకుడు అనూకల్ప్ గోస్వామి మాట్లాడుతూ తమకు ఆ సినిమాలో ఒక ముస్లిం అమ్మాయి పాత్ర అవసరమని ఆ పాత్రకు సరిపోయే నటి కోసం చాలా మందిని ఆడిషన్స్ చేశామని తెలిపారు.ఆమె బిగ్ బాస్ నుండి వచ్చిందా లేదా ఆమెకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు అనే విషయాలను మేము అస్సలు పట్టించుకోలేదు.కేవలం ఆ పాత్రకు తగిన నటి మాకు కావాలి.ఆ పాత్రకు తగినట్టుగా ఎవరిలో అయితే నటన కనిపించిందో,కథకు సరిపోయే క్యారెక్టర్ ఎవరిలో కనిపించిందో వారినే మేము ఎంపిక చేసుకున్నాం అని ఆయన వివరించారు.

నటనకే మా మొదటి ప్రాధాన్యత:
నటీనటుల ఎంపికలో బిగ్ బాస్ లేదా సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను ప్రామాణికంగా తీసుకున్నారనే విమర్శలను అనూకల్ప్ గోస్వామి గట్టిగా తిప్పికొట్టారు.ప్రొడక్షన్ హౌస్ పెద్దదైనా లేక సూపర్‌స్టార్ సినిమా అయినా ఒక సినిమాకు నలుగురు హీరోయిన్లు కావాలి అంటే అది చాలా కష్టం.మేము నటనకు ఆ క్యారెక్టర్‌కు సరిపోయే లక్షణాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాం.బిగ్ బాస్ నుండి వచ్చిందని లేదా ఇంత ఫాలోయింగ్ ఉందని చూసి మేము ఆయేషాను ఎంచుకోలేదు.ఆ నటిలో ఆ పాత్ర కనిపించాలి అనే ఒకే ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్ళాము అని ఆయన తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

ఆయేషా పాత్ర వివరాలు:
కపిల్ శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 లో కపిల్ పాత్రకు భార్యలుగా నలుగురు హీరోయిన్లు ఉన్నారు.ఆ నలుగురిలో ఆయేషా ఖాన్ ఒకరు.ఈ సినిమాలో ఆయేషా ఒక ముస్లిం మహిళ పాత్ర పోషిస్తున్నట్లు దర్శకుడు అనూకల్ప్ గోస్వామి తెలిపారు.ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది.