DSports Dec12, 2025: టీమిండియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా (South Africa) జట్టు అద్భుతమైన ప్రదర్శనతో 51 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి.. భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ గెలుపుతో సౌతాఫ్రికా జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టీ20లో ఘోర పరాజయం పాలైన ప్రొటీస్ జట్టు, ఈ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో పుంజుకుని.. పటిష్టమైన టీమిండియాకు షాకిచ్చింది.