
DSports Dec12, 2025: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందిస్తూ, జట్టు చేసిన రెండు ప్రధాన తప్పిదాలనే ఓటమికి కారణాలుగా పేర్కొన్నాడు. ముఖ్యంగా, తానూ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిందిగా అంగీకరించాడు.
“మా ఓటమికి నేనే బాధ్యుడిని. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ తొలి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత నేను బాధ్యత తీసుకుని… మరికాస్త ఎక్కువ సేపు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేయాల్సింది.”
