
DET:SEP17:
దుల్కర్ సల్మాన్ – పూజా హెగ్డే చిత్రంలో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర:
దక్షిణ భారత సినిమా రంగంలో తన ప్రత్యేక నటనతో ఎన్నో గుర్తింపులు తెచ్చుకున్న నటి రమ్యకృష్ణ ఇప్పుడు మళ్లీ ఒక కీలకమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఇటీవల ప్రకటించబడిన దుల్కర్ సల్మాన్ – పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “DQ 41” ప్రాజెక్ట్‌లో ఆమె భాగమవుతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రానికి ప్రతిష్ఠాత్మక బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుగుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ కథలో రమ్యకృష్ణ పాత్ర చాలా ముఖ్యమైందిగా చెప్పబడుతోంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు కొత్తగా ఓ బలం చేకూరుస్తుందని యూనిట్ విశ్వసిస్తోంది.
దుల్కర్ సల్మాన్ ఇటీవలి కాలంలో వరుస హిట్లతో తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు. పూజా హెగ్డే కూడా సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో బిజీగా ఉండగా, ఈ జంట స్క్రీన్‌పై ఎలా మెప్పిస్తుందో అన్న ఆసక్తి పెరిగింది. ఇప్పుడు రమ్యకృష్ణ జాయిన్ కావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
“DQ 41” షూటింగ్ ఇప్పటికే వేగంగా జరుగుతోంది.త్వరలోనే మరిన్ని వివరాలు,ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది.మొత్తానికి,రమ్యకృష్ణ జాయిన్ కావడంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగినట్టే చెప్పాలి.
