
DET:DEC 11:
ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ పర్యటన:
ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు ఇటీవల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనడానికి హైదరాబాద్కి వచ్చారు.రాష్ట్ర భవిష్యత్తు,పురోగతిపై దృష్టి సారించిన ఈ సమ్మిట్లో ఆయన కీలకోపన్యాసం చేశారు.ఈ సందర్భంగానే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో,మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక చర్చలు:
ఈ పర్యటనలో ఆనంద్ మహీంద్రా గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ విజన్ 2047 ప్రణాళిక గురించి చర్చించారు.ఈ విజన్ డాక్యుమెంట్ను చూసి మహీంద్రా గారు ముఖ్యమంత్రి దార్శనికతను,దూరదృష్టిని ఎంతగానో ప్రశంసించారు.రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై తనకున్న అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డితో పంచుకున్నారు.సీఎం రేవంత్ రెడ్డి గారు ఆనంద్ మహీంద్రాను స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్గా ఉండాలని కోరగా, మొదట సంశయించినా,రేవంత్ రెడ్డి గారి లక్ష్యాలను విన్నాక దాన్ని అంగీకరించినట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవితో అద్భుతమైన భేటీ:
ఆనంద్ మహీంద్రా గారు హైదరాబాద్ పర్యటనలో అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవిని కలవడం జరిగింది.ఈ భేటీ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని,అది ఒక అందమైన సర్ప్రైజ్ అని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.చిరంజీవి గారు ఒక లెజెండ్ అని కొనియాడిన ఆనంద్ మహీంద్రా,చిరంజీవిలోని వినయం,కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.ఏ రంగంలోనైనా స్థిరమైన విజయాన్ని సాధించడానికి ఈ రెండు లక్షణాలు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
సమ్మిట్లో ప్రత్యేక దృశ్యం:
ఈ సమ్మిట్ సందర్భంగా ఆనంద్ మహీంద్రా,చిరంజీవి మాట్లాడుకుంటుండగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మధ్యలో నవ్వుతూ ఆ సంభాషణను ఆసక్తిగా వింటున్న ఒక ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది.ఈ సమావేశాలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాధాన్యతను,రాష్ట్రం పారిశ్రామికంగా,సాంస్కృతికంగా ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో తెలియజేస్తున్నాయి.
