DNews 10 Dec: ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం ఉండే ప్రాంతంలో, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షాల కారణంగా పలు నగరాల్లోని ప్రధాన రహదారులు నీటమునిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సౌదీ వాతావరణ శాఖ (National Center of Meteorology – NCM) ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఎర్ర సముద్రం తీర ప్రాంతాల్లో రానున్న రోజుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది.

ఎడారి ప్రాంతంలో ఇలాంటి భారీ వర్షాలు, వరదలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. వాతావరణ మార్పుల ప్రభావమే దీనికి కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సహాయక బృందాలు వరద నీటిని పంపేందుకు, చిక్కుకున్న వారిని రక్షించేందుకు చురుకుగా పనిచేస్తున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana