DNews:10 Dec:హైదరాబాద్ జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 300కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం, వార్డుల పునర్విభజనపై ప్రజల అభ్యంతరాలు, సలహాలను బుధవారం నుంచి జీహెచ్ఎంసీ స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగనుంది.

పునర్విభజన ప్రాసెస్‌ను స్పీడప్ చేసిన జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులు, జోనల్ ఆఫీసులు మరియు హెడ్ ఆఫీసులో స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు అందించవచ్చు.

మే లేదా జూన్‌లో గ్రేటర్ ఎన్నికలు?

గ్రేటర్ హైదరాబాద్లో విలీన ప్రాంతాలపై ఏర్పడిన హడావిడి చూస్తుంటే ప్రభుత్వం త్వరితగతిన ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించడంతో పార్టీ జోష్ కూడా పెరిగింది. ఇదే ఉత్సాహంలో గ్రేటర్ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే వార్డు పునర్విభజన పూర్తి చేసి రిజర్వేషన్ల ప్రకటనతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే సంవత్సరం మే లేదా జూన్ నెలల్లో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana