
DET:DEC 10:
కొత్త ఫ్యామిలీ డ్రామా ప్రకటన:
ఈటీవీ విన్ సంస్థ తమ కొత్త ఒరిజినల్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.ఈ చిత్రానికి పాకశాల పంతం అనే పేరు పెట్టారు.ఇందులో ప్రధాన పాత్రల్లో ప్రముఖ నటీమణులు రమ్య కృష్ణన్ మరియు ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.కుటుంబ కథా చిత్రాలకు కొత్త నిర్వచనం ఇస్తుందని మేకర్స్ ఈ సినిమా గురించి చెప్తున్నారు.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు:
ఈ చిత్రానికి కరణ్ తుమ్మకొమ్మ దర్శకత్వం వహిస్తున్నారు.కొల్లా పిక్చర్స్ బ్యానర్‌పై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రమ్య కృష్ణన్,ఐశ్వర్య రాజేష్‌తో పాటు మహాత్ రాఘవేంద్ర,సంజయ్ స్వరూప్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి వస్తాం అనే చిత్రంతో బాగా గుర్తింపు తెచ్చుకున్న బాలనటుడు రేవంత్ కూడా ఇందులో భాగమయ్యాడు.సాంకేతిక వర్గం విషయానికి వస్తే,నిర్మాణ రూపకల్పన బాధ్యతలను విష్ణువర్ధన్ గౌడ్ చూసుకుంటుండగా,సంగీతాన్ని ఆర్.హెచ్.విక్రమ్ అందిస్తున్నారు.
ఆసక్తికరమైన కాన్సెప్ట్ పోస్టర్:
సినిమా ప్రకటన సందర్భంగా మేకర్స్ ఒక కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు.యానిమేటెడ్ రూపంలో ఉన్న ఈ పోస్టర్,బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్న ఒక వంటగది లోపల దాగివున్న తీవ్రమైన ఉద్రిక్తతను సూచిస్తోంది.టైటిల్లోని పాకశాల మరియు పంతం అనే పదాలు,కథ వంటకి లేదా కుటుంబ పోరుకు సంబంధించిన బలమైన ఎమోషన్స్‌తో నడుస్తుందని స్పష్టం చేస్తున్నాయి.
