DNews:09 Dec: ప్రపంచ ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ ఈ నెల డిసెంబర్ 13 (శనివారం) నాడు హైదరాబాద్‌కు రానుండటంతో నగరంలో ఉత్సాహం ఎక్కిపోతుంది. మెస్సీ పర్యటన క్రీడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన షెడ్యూల్ వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినా, పలు వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమైన అంశాలు వెలుగుచూశాయి.మెస్సీ నగరానికి డిసెంబర్ 13న సాయంత్రం 4 గంటల సమయంలో చేరుకునే అవకాశముంది. తరువాత నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా సహా పలు అంతర్జాతీయ ప్రతినిధి బృందాల కార్యక్రమాలు ఇదే ప్యాలెస్‌లో నిర్వహించబడటం తెలిసిందే.

మెస్సీ పర్యటనలో ప్రధాన ఆకర్షణ సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫుట్‌బాల్ ఈవెంట్.ఇందులో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీమ్‌తో కలిసి మ్యాచ్ ఆడనున్నారు.
మ్యాచ్ అనంతరం స్కూల్ పిల్లలతో ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్‌లో పాల్గొని తన అనుభవాలు, క్రీడా విలువలు, ప్రేరణ గురించి వారితో మాట్లాడనున్నారు.మెస్సీ హైదరాబాద్ పర్యటన మొత్తం 2 గంటలపాటు మాత్రమే ఉండనుందని సమాచారం.ఈవెంట్ అనంతరం ప్రభుత్వ తరఫున ప్రత్యేక సన్మాన కార్యక్రమం కూడా ఉండనుంది. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం కానున్నారు.

మెస్సీ రాక నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పూర్తిగా నిండే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ సహా అధికారులు స్టేడియాన్ని పరిశీలించారు.ప్రపంచంలో అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా చేరికైన మెస్సీ పర్యటనతో హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కు కొత్త గుర్తింపు, ఉత్సాహం లభించనుంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana