
DNews: Dec 09: హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో “ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్” అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ చర్చలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుట్ట జ్వాల పాల్గొని, తెలంగాణలో క్రీడల అభివృద్ధికి మంచి కోచ్లు అవసరమని, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ఆమె మాట్లాడుతూ, క్రీడాకారులను వెలికితీయడానికి మంచి కోచ్లు ఉండటం అత్యంత కీలకమని, ఈ అభిప్రాయాన్ని అనేక మంది క్రీడాకారులు వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సమావేశం క్రీడా రంగ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మరో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ కూడా ఈ చర్చలో పాల్గొని, క్రీడల్లో రాణించాలంటే మంచి కోచ్లు, మంచి విద్య అవసరమని పేర్కొన్నారు. క్రీడా రంగం అభివృద్ధి కోసం మైదాన స్థాయి నుంచే చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సమ్మిట్లో క్రీడలపై మంచి చర్చ జరిగిందని, ఇలాంటి చర్చలు క్రీడా రంగానికి మేలు చేస్తాయని, ఈ సమావేశం ద్వారా క్రీడా రంగంలో మంచి మార్పులు వస్తాయని సింధూ నమ్మకం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, గ్లోబల్ సమ్మిట్లో భాగంగా హాల్ నం. 2లో జరిగిన “తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్” చర్చలో సింధూ, గుట్ట జ్వాలలతో పాటు కుంబ్లే, గోపిచంద్, అంబటి రాయ.
