
DSports 9 Dec: భారత్‌తో డిసెంబర్ 9న (నేడు) ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఆటతీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ వికెట్ తమ బౌలర్లకు ఎంతో ముఖ్యమని, అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని మార్‌క్రమ్ అభిప్రాయపడ్డారు.
టీ20 సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన మార్‌క్రమ్.. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం భారత్‌కు పెద్ద లోటైనా, భారత యువ జట్టు ఏమాత్రం తక్కువ కాదని అన్నారు.
