DSports 9 Dec:ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన అంకితభావం, దృఢ సంకల్పంతో మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో తన వివాహం రద్దైనట్లు అధికారికంగా ప్రకటించిన 24 గంటల్లోపే ఆమె క్రికెట్ మైదానంలో అడుగుపెట్టింది.

‘దటీజ్‌ మంధాన’ అంటూ క్రీడా ప్రపంచం, అభిమానులు ఆమె గుండె నిబ్బరాన్ని, దేశం పట్ల ఆమెకున్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు.

శ్రీలంక సిరీస్‌కు సన్నాహకాలు
మంధాన తన స్వస్థలంలో సోమవారం (డిసెంబర్ 8, 2025) నెట్ ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించింది. రాబోయే శ్రీలంకతో జరగబోయే 5 టీ20ల సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు ఆమె బ్యాట్ పట్టింది.స్మృతి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను ఆమె సోదరుడు శ్రవణ్ మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత బాధను పక్కనపెట్టి, వెంటనే మైదానంలోకి దిగిన ఆమె ప్రొఫెషనలిజంకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది.వివాహ రద్దు గురించి ప్రకటన చేసిన సందర్భంగా కూడా స్మృతి మంధాన.. ఇకపై తన దృష్టి అంతా క్రికెట్‌పైనే, దేశానికి మరిన్ని ట్రోఫీలు అందించడంపైనే ఉంటుందని స్పష్టం చేసింది. చెప్పినట్టే వెంటనే గ్రౌండ్‌లో దిగి తన నిబద్ధతను నిరూపించుకుంది.

వ్యక్తిగత కష్టాలను ఎదుర్కొంటూనే తన వృత్తికి, దేశానికి ప్రాధాన్యతనిచ్చిన స్మృతి మంధాన చర్య.. యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana