DNews: Dec 08: జగిత్యాల గ్రామీణంలో పుట్టి పెరిగిన రాజ్ నరేంద్ర, తన జీవితాన్ని ఫోటోగ్రఫీతో ప్రారంభించి దర్శకుడిగా ఎదిగిన వ్యక్తి. ఆయన రూపొందించిన జానపద గీతాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పెద్దిరెడ్డి’ పాట, తండ్రి తన కుమార్తెను పెంచి పెళ్లి చేసి అత్తింటికి పంపే భావోద్వేగ దృశ్యాన్ని ప్రతిబింబిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాటకు ఐదు రోజుల్లోనే ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం, వేల సంఖ్యలో రీల్స్ తయారవడం విశేషం. రాజ్ నరేంద్ర ఈ పాటలో తండ్రి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. సినిమాలతో పాటు ఆయన రూపొందించిన జానపద గీతాలలో ‘వడన్నా గూడ్నల్లో’, ‘చిన్నాటి ప్రేమ’, ‘దరంథ మా పుల వనమే రాధమ్మా’, ‘నల్లనల్లని మబ్బుల్లా’, ‘బండెక్కి వస్తానే బావ’, ‘యెరేత బాగ్నేదమ్మా’, ‘తల్లి లాచులు’, ‘సీతపటా కురిసేటి సినుకుల్ల వన’ వంటి పాటలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఆయన నటించిన ‘కలివివనం’ సినిమా పాత్రతో పాటు, దర్శకత్వం వహించిన ‘పెద్దిరెడ్డి’ పాట తనకు అపారమైన సంతృప్తి ఇచ్చిందని రాజ్ నరేంద్ర తెలిపారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana