
DET:DEC 08:
ఓం శాంతి శాంతి శాంతిహి విడుదల తేదీ ఖరారు:
యువ నటుడు దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్ మరియు అందాల నటి ఈషా రెబ్బ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిహి విడుదల తేదీని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినీ ప్రేమికులకు ఇది శుభవార్తే.మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ జయ జయ జయ హే సినిమాకు ఇది తెలుగు రీమేక్.
విడుదల తేదీ ఎప్పుడంటే?
ఓం శాంతి శాంతి శాంతిహి సినిమాను వచ్చే ఏడాది జనవరి 23,2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.ఇంతకుముందు ఈ సినిమాను ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ,కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.అయితే ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.జనవరిలో సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చే మంచి తేదీని మేకర్స్ ఎంచుకున్నారు.
ప్రధాన తారాగణం దర్శకత్వం:
ఈ సినిమాకు ఎ.ఆర్. సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో తరుణ్ భాస్కర్ అంబాటి ఓంకర్ నాయుడుగా,ఈషా రెబ్బ కొండవీటి ప్రశాంతి అనే పాత్రల్లో నటిస్తున్నారు.వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని చిత్ర బృందం చెబుతోంది.శ్రీజన్ యారబోలు మరియు మూవీ వర్స్ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రం నిర్మించబడుతోంది.జయ క్రిష్ సంగీతం అందిస్తున్నారు.
టీజర్,ప్రమోషన్స్ అప్డేట్:
విడుదల తేదీతో పాటు ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 9, 2025 విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకోనున్నాయి.ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ పూర్తి నమ్మకంతో ఉంది.
