DET:DEC 08:
ఉగ్రరూపం చూపించిన రోషన్ మాథ్యూ:
అద్వైత్ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చథా పచా: ది రింగ్ ఆఫ్ రౌడీస్ నుంచి రోషన్ మాథ్యూ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.ఈ పోస్టర్‌లో రోషన్ మాథ్యూ వెట్రి అనే పాత్రలో కనిపించనున్నారు. ఉగ్రంగా, మాస్ లుక్‌లో ఉన్న ఆయన పాత్ర ఈ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రంతో సినీ పరిశ్రమలో రోషన్ మాథ్యూ పదేళ్ల ప్రయాణాన్ని కూడా మేకర్స్ గుర్తు చేసుకున్నారు.

రెజ్లింగ్ ప్రపంచంలో చథా పచా:
ఈ సినిమా కేరళలోని రెజ్లింగ్ సంస్కృతి నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించనుంది. ఇదొక యాక్షన్, ఎమోషనల్, కాంబట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ టీజర్ ఫోర్ట్ కొచ్చి లోని అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ క్లబ్, అక్కడి ఆటగాళ్ల జీవితాలను చూపించింది. ఈ సినిమాకు శంక‌ర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీతం అందిస్తున్నారు.

రోషన్ మాథ్యూ ఎక్స్‌పీరియన్స్:
ఈ సందర్భంగా రోషన్ మాథ్యూ మాట్లాడుతూ, నేను ఇంతవరకు చేసిన చిత్రాలకు చథా పచా చాలా భిన్నంగా ఉంటుంది. ఇదొక ప్రత్యేకమైన ఆలోచనతో రూపుదిద్దుకున్న చిత్రం. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఉన్నాను. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అని అన్నారు. ప్రొడ్యూస‌ర్ షిహాన్ షౌక‌త్‌ మాట్లాడుతూ, ఈ చిత్రం గ్రిట్, కల్చర్‌, బిగ్-స్క్రీన్ ఎనర్జీ కలగలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు.