DET:DEC 06:
జపాన్ పర్యటనలో ప్రభాస్ రాజమౌళి చేతి రాత లేఖ పంచుకున్న డార్లింగ్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.అక్కడ ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా బాహుబలి ది ఎపిక్ ప్రత్యేక ప్రదర్శన మరియు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా జపాన్ అభిమానులు చూపించిన ప్రేమకు ప్రభాస్ ఎంతగానో ముగ్ధులయ్యారు.అయితే ఈ పర్యటనలో ఆయన బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు.

రాజమౌళి హృదయపూర్వక లేఖ:

ప్రభాస్ జపాన్ వెళ్లిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆయనకు ఒక చేతి రాత లేఖను పంపారు.ఆ లేఖను ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.అందులో రాజమౌళి,జపాన్ అభిమానుల గురించి ఎంత గొప్పగా చెప్పారో వివరించారు.నీకు జపాన్ అభిమానులంటే ఎంత ఇష్టమో,వారు నీకు ఎంత అభిమానులో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుందని తెలుసు.నేను నాలుగు సార్లు జపాన్ వెళ్ళినప్పుడు,అందరూ నన్ను ఒకటే ప్రశ్న అడిగేవారు-ప్రభాస్ ఎప్పుడు వస్తారు?అని ఎట్టకేలకు నా బాహుబలి అక్కడ సందడి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని రాజమౌళి ఆ లేఖలో పేర్కొన్నారు.

అభిమానుల ప్రేమను చూసి ఆనందబాష్పాలు:
రాజమౌళి లేఖలో నీకు వారి అభిమానం చూసి ఆనందబాష్పాలు వస్తాయని నాకు తెలుసు.నీవు వారి కోసం ఎంత కేర్ తీసుకుంటున్నావో,వారికి కూడా చూపించాలి అని రాశారు.జపాన్‌ను తన “రెండవ ఇల్లు”గా అభివర్ణించిన రాజమౌళి,చివర్లో జపాన్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ అరిగటో గోజైమాసు అని జపనీస్ భాషలో రాశారు.ఈ లేఖను పోస్ట్ చేస్తూ ప్రభాస్,రాజమౌళిని మిస్ అవుతున్నానని చెప్పడం,వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరోసారి తెలియజేసింది.

జపాన్‌లో బాహుబలి: ది ఎపిక్ హవా:
డిసెంబర్ 12న జపాన్‌లో బాహుబలి ది ఎపిక్ అధికారికంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా ప్రభాస్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది.జపనీస్ భాషలో బాహుబలి బొమ్మలు,క్యారెక్టర్‌లతో ఏర్పాటు చేసిన బోర్డులపై ఆయన ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.ప్రభాస్ కూడా అభిమానులతో మాట్లాడుతూ,గత పదేళ్లుగా జపాన్ గురించి చాలా విన్నాను.ఇక్కడికి రావడం నా కల నెరవేరింది.ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో అభిమానులు ఉప్పొంగిపోయారు.ప్రభాస్ పర్యటన భారతీయ సినిమాకు,జపాన్ ప్రేక్షకులకు మధ్య ఒక సాంస్కృతిక వారధిలా నిలిచింది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana