
DNews: Dec 06: కౌటాల (ఆదిలాబాద్) శుక్రవారం రోజున తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని వార్ధా నదిలో పులి అడుగుజాడలు స్థానికులు గుర్తించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తరూర్ గ్రామం సమీపంలో, అలాగే మండలంలోని తాటిపల్లి గ్రామం దగ్గర పులి అడుగుజాడలు కనిపించాయని స్థానికులు మహారాష్ట్ర అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ అధికారులు అక్కడికి చేరుకుని అడుగుజాడలను పరిశీలించి ప్రజలకు అప్రమత్తం చేశారు. సోషల్ మీడియాలో పులి అడుగుజాడల వీడియో వైరల్ కావడంతో కౌటాల సెక్షన్ అటవీ అధికారులు తులసీరాం, శ్రీదేవి వార్ధా నది పరిసరాలను పరిశీలించారు. తెలంగాణ వైపు అడుగుజాడలు కనిపించకపోయినా, ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. తాటిపల్లి గ్రామంలో నోటీసు జారీ చేసి, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
