DET:DEC 05:
విడుదల వాయిదా ఊహించని పరిణామం:
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఎంతో అంచనాలతో రూపొందిన ‘అఖండ 2’ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే విడుదల తేదీకి కేవలం కొద్ది గంటల ముందు సినిమా ప్రీమియర్ షోలు రద్దు కావడం ఆ తర్వాత ఏకంగా సినిమా విడుదలనే వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించడంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొదట్లో సాంకేతిక సమస్యల వల్ల వాయిదా అని చెప్పినా, అసలు కారణం వేరే ఉందని తర్వాత తెలిసింది.

మద్రాస్ హైకోర్టు స్టే అసలు వివాదం ఏంటి?

అఖండ 2 విడుదల వాయిదా పడటానికి ప్రధాన కారణం మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్. ఈ స్టే వెనుక ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ఉంది.పాత లావాదేవీలు ఈ వివాదం నిర్మాత సంస్థ అయిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్/14 రీల్స్ ప్లస్ మరియు ఏరోస్ ఇంటర్నేషనల్ మధ్య ఉన్న పాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది.బకాయిలు, మహేశ్ బాబు నటించిన 1 నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాల వల్ల ఏరోస్ సంస్థకు భారీ నష్టాలు వచ్చాయని, ఆ సినిమాలకు సంబంధించి 14 రీల్స్ సంస్థ ఏరోస్‌కు సుమారు రూ. 27 నుండి 28 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఏరోస్ కోర్టును ఆశ్రయించింది.ఆ బకాయిలు చెల్లించకుండా 14 రీల్స్ సంస్థ 14 రీల్స్ ప్లస్ పేరుతో కొత్త సినిమాలు అఖండ 2 విడుదల చేయాలని ప్రయత్నిస్తోందని ఏరోస్ ఆరోపించింది.

కోర్టు ఆదేశం:
ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అఖండ 2 చిత్రాన్ని థియేటర్లలో లేదా డిజిటల్‌గా విడుదల చేయకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు స్టే విధించిన తర్వాత, సినిమా విడుదల నిలిచిపోకుండా ఉండేందుకు 14 రీల్స్ ప్లస్ మరియు ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య చివరి నిమిషం వరకు చర్చలు జరిగాయి. కానీ, ఆ చర్చలు విఫలం కావడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా ప్రీమియర్స్ మరియు విడుదల నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ పరిణామం చిత్ర బృందానికి మరియు అభిమానులకు షాకిచ్చింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana