DNews:04 Dec:బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. హిల్ట్ పాలసీ (HILTP) పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు ₹5 లక్షల కోట్ల విలువైన భారీ భూమి కుంభకోణం చేస్తోందని ఆయన విమర్శించారు. పరిశ్రమల కోసం ప్రజలు ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రభుత్వము కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

కేటీఆర్ నేతృత్వంలోని నిజనిర్ధారణ బృందం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించింది. హమాలీలతో మాట్లాడి పరిస్థితులను పరిశీలించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా పేర్కొన్నారు:
ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులవి కాకుండా, ప్రజలు మరియు ప్రభుత్వం అప్పగించినవేనని స్పష్టం చేశారు.
పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించాలనే నిబందనతో ఇచ్చిన ఈ భూములను ఇప్పుడు అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సుల కోసం మార్చుతున్నారని ఆరోపించారు.జీడిమెట్ల ప్రాంతంలో గజం మార్కెట్‌ ధర ₹1.5 లక్షలు ఉన్నా, ప్రభుత్వం కేవలం ₹4,000కే ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయడం కుంభకోణమని పేర్కొన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ 9,300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీనిని వెంటనే రద్దు చేసి ఆ భూములపై ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.నగరంలోని పరిశ్రమలు తరలిపోతే లక్షల మంది ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి “ఆవినీతి అనకొండ”గా మారారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.ఈ స్కామ్ ద్వారా లక్షల కోట్లు దోచుకొని ఢిల్లీకి ముట్టజెప్పే ప్రయత్నమని ఆరోపించారు.ఇది కేవలం ఆరంభం మాత్రమే – అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు.బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.పారిశ్రామికవేత్తలు ఈ “భూ కుంభకోణం”లో భాగస్వాములు కాకుండా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.హిల్ట్ పాలసీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు:అఖిలపక్ష సమావేశం రౌండ్ టేబుల్ చర్చలు కాలనీల్లో ప్రజా సమావేశాలు నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana