DET:DEC 03:
అనుకోకుండా ఒకే నెలలో మూడు సినిమాలు!
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన కృతి శెట్టి, కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. ఈ డిసెంబర్‌లో ఆమె నటించిన మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. ఒకే నెలలో నా మూడు సినిమాలు వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు బహుశా ఈ విశ్వమే అలా ప్లాన్ చేసిందేమో” అని కృతి అన్నారు. ఈ సినిమాలన్నీ తమిళంలో రూపొందినప్పటికీ కొన్ని తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి.

మూడు చిత్రాలు.. మూడు విభిన్నమైన పాత్రలు:
కృతి నటించిన ఈ మూడు సినిమాలు – వా వాతియార్,లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు జీనీ మూడు వేర్వేరు ఫాంటసీ కథాంశాలు అని ఆమె తెలిపారు.

సక్సెస్ అంటే నా దృష్టిలో..!

తన కెరీర్‌లో సక్సెస్‌ని ఎలా చూస్తాననే ప్రశ్నకు కృతి శెట్టి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. సినిమాలు బాగా ఆడటం అనేది ఆడియన్స్ ఇచ్చే ముఖ్యమైన గుర్తింపు అయినప్పటికీ నా దృష్టిలో సక్సెస్ అంటే కేవలం అదే కాదు అన్నారు. నేను చేసిన నటన పట్ల దర్శకులు సంతోషంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకుని, నా నటనను నేను మెరుగుపరుచుకోవడానికి వీలుండాలి. ఇదే నాకు నిజమైన విజయం” అని ఆమె చెప్పుకొచ్చారు. మెటీరియలిస్టిక్ విజయాలకు తాను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనని తెలిపారు.

కొత్తగా యాక్షన్ ట్రై చేస్తున్నా:
తను భవిష్యత్తులో చేయాలనుకుంటున్న పాత్రల గురించి మాట్లాడుతూ, యోధురాలైన యువరాణి పాత్ర అంటే చాలా ఇష్టమని చెప్పారు. యాక్షన్ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నానని, అందుకే దాదాపు ఒక సంవత్సరం నుంచి తైక్వాండో శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి కొత్త ప్రయత్నాలు చేయడం తనకు చాలా ఇష్టమని కృతి తెలిపారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana