
DNews : Dec 02: వికారాబాద్ రూరల్‌లో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ షేక్ యాస్మిన్ బాషా వికారాబాద్ మరియు నవాబ్‌పేట్ మండలాల్లోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. ఆయన ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సమీక్షించి, అధికారులు ఎలాంటి తప్పులు లేకుండా సజావుగా నిర్వహించాలని సూచించారు. అవసరమున్న వారు హెల్ప్‌డెస్క్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎన్నికల లావాదేవీలు కొత్త బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే జరపాలని ఆయన ఆదేశించారు. నిర్ణీత సమయానికి నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చుల వివరాలపై పూర్తి అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కూడా ఆయన పరిశీలించారు.
