
DSports 2 Dec: ఇటలీ టెన్నిస్ చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ క్రీడాకారుడు, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ నికోలా పీట్రాంగెలీ (Nicola Pietrangeli) కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. సోమవారం (డిసెంబర్ 1, 2025) రోమ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇటాలియన్ టెన్నిస్, పాడెల్ ఫెడరేషన్ (FITP) అధికారికంగా ధృవీకరించింది.
