
DNews : Dec 01: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా టీగల బ్రిడ్జి నిర్మాణం, మున్నేటి ఇరువైపులా కాంక్రీటు గోడలు, అంతర్గత కాలువ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నగరాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు రూపొందించిన ప్రణాళికలను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలాగే ఉద్యానవనాలు, అర్బన్ పార్కులు, ట్రాక్‌లు నిర్మాణం మరియు ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్ పునుకొళ్ళు నీరజ, కమిషనర్ అభిషేక్ ఆగస్త్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
