
DET:DEC 01:
కమల్ హాసన్: చెత్త సినిమాలు చేస్తున్నప్పుడు త్వరగా రిటైర్ అవ్వాలనిపిస్తుంది:
సినీ ప్రస్థానంపై విభిన్న కోణం:
నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన కమల్ హాసన్ తన సినీ ప్రయాణం గురించి, వ్యక్తిగత ఆలోచనల గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మలయాళంలో జరిగిన మనోరమ హార్టస్ అనే సాహిత్య, కళా ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మనసులో మాటను బయటపెట్టారు. సాధారణంగా కమల్ హాసన్ ఎప్పుడూ తన కళను, సినిమాను ప్రేమిస్తూ ఉంటారు. కానీ, ఆయన ఈసారి మాట్లాడిన తీరు కొంత ఆశ్చర్యం కలిగించింది. ఒక గొప్ప నటుడు తన కెరీర్ గురించి ఇలా మాట్లాడటం వెనుక అంతరార్థం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది.
కం బ్యాక్ అంటోంటే అసంతృప్తి:
కమల్ హాసన్‌ని గత కొద్ది రోజులుగా ఆయన లేటెస్ట్ సినిమాలు ముఖ్యంగా తుగ్ లైఫ్ ప్రస్తావనలో ఆయనకు తిరిగి సక్సెస్ ఫాంలోకి రావడంగా మారుతున్నాయని వ్యాఖ్యాత అడిగారు. దీనిపై కమల్ హాసన్ స్పందిస్తూ, తనకు ఆ కం బ్యాక్ అనే మాట వినడానికి ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. నేను ఇప్పటికీ సినిమాల్లో ఉన్నాను, సినిమా చేస్తూనే ఉన్నాను. మరి కం బ్యాక్ అని ఎందుకు అంటారు? అని ఆయన ప్రశ్నించారు. ఈ మాటలు బహుశా ఆయన కొన్ని సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేకపోయారనే విమర్శలకు పరోక్షంగా సమాధానంగా వినిపించాయి.
నిజాయితీతో కూడిన వ్యాఖ్య:
ఈ చర్చలో కమల్ హాసన్ చేసిన అత్యంత కీలకమైన వ్యాఖ్య ఇది. నేను మంచి సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నప్పుడు, జీవితాంతం నటించాలనిపిస్తుంది. కానీ, ఎప్పుడైతే నేను ‘చెత్త సినిమాలు’ చేస్తున్నట్లు అనిపిస్తుందో అప్పుడు త్వరగా రిటైర్ అయిపోవాలనిపిస్తుంది అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఎంత నిబద్ధతతో ఉంటారో తెలియజేస్తాయి. సినిమా అంటే కేవలం డబ్బు సంపాదించడం కోసమో, లేదా పేరు కోసమో కాదు, అది ఒక కళగా భావించే ఆయన వ్యక్తిత్వం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. నాణ్యత లేని సినిమాలు చేయడం ఆయనకు నచ్చదని, అది తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని ఆయన మాటల్లో అర్థమవుతోంది.
సహనటులు-సహకారం:
ఒకవేళ తాను చేస్తున్న సినిమా బాలేదనిపిస్తే, దాని నుండి త్వరగా బయటపడాలని, లేదా త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి వెళ్లిపోవాలని అనిపిస్తుందని కమల్ హాసన్ తెలిపారు. ఒక డైరెక్టర్ లేదా టీం సరిగా పనిచేయడం లేదని తెలిసినా, ఆ షెడ్యూల్‌ను పూర్తి చేయాలి. నా సహనటులు, సహ దర్శకులు అందరూ వారి పని కోసం వేచి చూస్తుంటారు. వారిని ఇబ్బంది పెట్టకుండా, నా పాత్ర వరకూ పూర్తి చేసి తొందరగా వెళ్లాలనిపిస్తుంది’ అని కమల్ హాసన్ అన్నారు. తనలోని కళాకారుడు సంతృప్తి చెందని సమయంలో, దాన్ని త్వరగా ముగించాలనే తపన ఆయన మాటల్లో వినిపించింది.
