
DSports 1 Dec: రాంచీ: భారత్‌తో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ తన జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఓటమికి గల ప్రధాన కారణాన్ని వివరిస్తూ, ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యమే కొంప ముంచిందని స్పష్టం చేశాడు.
పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మార్‌క్రమ్ మాట్లాడుతూ, లక్ష్య ఛేదనలో తమ జట్టు కనబర్చిన పోరాట స్ఫూర్తిని ప్రశంసించాడు.
మొదటి వన్డేలో పరాజయం పాలైనప్పటికీ, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, తప్పులను సరిదిద్దుకుని విశాఖపట్నంలో జరగబోయే రెండో వన్డేలో మరింత పటిష్టంగా బరిలోకి దిగుతామని మార్‌క్రమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
