DNews 29 Nov:హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో భూములను అమ్ముకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు (నవంబర్ 28) హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.

“లక్ష్యమంతా భూముల అమ్మకమే!”
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన పలు ప్రాజెక్టులు మరియు ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్న అసలు లక్ష్యం భూముల అమ్మకమేనని హరీశ్‌రావు ఆరోపించారు.

“తెలంగాణ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసిన కొత్త ప్రాజెక్టులన్నీ భూములను దోచుకునేందుకే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొరికిన కాడికి భూములను అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు. పాతబస్తీ మెట్రో, ఎలివేటెడ్ కారిడార్ల వెనుక అసలు ఉద్దేశం ఇదే. మౌలిక వసతుల కల్పన ముసుగులో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అమ్మేయాలని చూస్తున్నారు.”

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana