DSports 28 Nov:ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఏకంగా రెండు ప్రముఖ ఫ్రాంచైజీలు యాజమాన్యాన్ని మార్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గొయెంకా తన సోషల్ మీడియా (X) వేదికగా వెల్లడించడంతో ఈ అంశం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

నవంబర్ 27న హర్ష గొయెంకా చేసిన పోస్ట్ వివరాలు:

“నేను విన్న దాని ప్రకారం, ఒకటి కాదు, రెండు ఐపీఎల్ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి.. అవి RCB, RR. ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న భారీ విలువను సొమ్ము చేసుకోవడానికి యజమానులు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి రెండు జట్లు అమ్మకానికి, 4 నుంచి 5 మంది కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారు! మరి విజయం సాధించే కొనుగోలుదారులు పూణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా USA నుంచి వస్తారా?” అని ఆయన పేర్కొన్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana