
DNews: Nov 28: నల్లకుంటలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామనగర్ డివిజన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కాంటీన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరానికి ఉపాధి కోసం వచ్చే వారికి మరియు పేదలకు ఈ కాంటీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేవలం రూ.5కే అల్పాహారం (టిఫిన్) మరియు రూ.5కే మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గోపాల్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
