
DSports 28 Nov: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం 2025లో ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాటర్ అయిన అలీసా హీలీ అమ్ముడుపోకపోవడం పెద్ద షాక్‌గా నిలిచింది.వేలంలో మొట్టమొదటి ప్లేయర్‌గా ఆమె పేరు వచ్చినప్పటికీ, ఏ ఫ్రాంచైజీ కూడా ఆమె కనీస ధర ₹50 లక్షలకు బిడ్ వేయలేదు.హీలీ గతంలో యూపీ వారియర్జ్ జట్టుకు కెప్టెన్‌గా ఆడింది. ఆ జట్టు ఆమెను ఈ వేలానికి ముందు విడుదల చేసింది.ఇంతటి స్టార్ ప్లేయర్ అమ్ముడుపోకపోవడానికి గల ప్రధాన కారణాలను ఫ్రాంచైజీ.
కోచ్‌లు ఇలా వివరించారు:
ఓవర్సీస్ కోటా : ప్లేయింగ్ ఎలెవన్‌లో కేవలం నలుగురు విదేశీ ఆటగాళ్లనే ఆడించడానికి అవకాశం ఉండటం వల్ల, చాలా జట్లు కేవలం వికెట్ కీపర్-బ్యాటర్ కంటే ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇచ్చాయి.
గాయం ఆందోళన: ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఆమె కండరాల గాయం కారణంగా కొన్ని కీలక మ్యాచ్‌లకు దూరమైంది. ఈ ఫిట్నెస్ సమస్యపై ఫ్రాంచైజీలకు కొంత ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది.
జట్టు కూర్పు : ఆర్సీబీ (RCB) వంటి జట్లు తమ జట్టులో ఇప్పటికే రిచా ఘోష్ రూపంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఉండటం వల్ల, హీలీ కోసం ప్రయత్నించలేదని తెలిపాయి.
అద్భుతమైన ఫామ్‌లో, వరల్డ్ కప్ విన్నర్ అయినప్పటికీ, వ్యూహాత్మక కారణాల వల్ల ఆమె ఈ WPL సీజన్లో ఆడటం లేదు.
