
DSports 28 Nov:లక్నో: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025లో భారత బ్యాడ్మింటన్ భవితవ్యంపై ఆశలు రేపుతున్న 16 ఏళ్ల యువ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయాన్ని నమోదు చేసింది. మహిళల సింగిల్స్ ప్రి-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె జపాన్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ పతక విజేత నొజోమి ఒకుహరాను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.తన్వీ శర్మ తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. బలమైన ఒకుహరా చేతిలో తొలి గేమ్‌ను 13-21 తేడాతో కోల్పోయినప్పటికీ, ఏ మాత్రం నిరాశ చెందకుండా అద్భుతంగా పుంజుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు గేముల్లో (21-16, 21-19) పట్టుదలను ప్రదర్శిస్తూ, అనుభజ్ఞురాలైన ఒకుహరాపై విజయం సాధించింది.
ఈ విజయాలతో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.
