DNews:27 Nov:హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) పనితీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సున్నం చెరువు కూల్చివేతల విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని హైకోర్టు ఘాటు విమర్శలు చేసింది.గురువారం నాడు జరిగిన విచారణలో, హైకోర్టు HYDRAA అధికారులను ఉద్దేశించి చేసిన కీలక వ్యాఖ్యలు, ప్రశ్నలు: రాజ్యాంగ హక్కులను హైడ్రా ఉల్లంఘించింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకేశారు?””గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?”ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారు? అసలు FTL నిర్ధారణే జరగనప్పుడు హద్దులు ఎలా నిర్ణయిస్తారు?” హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదు?”సున్నం చెరువు సియేట్ కాలనీలో ఉన్న వారిపై HYDRAA చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తాయని హైకోర్టు హెచ్చరించింది.సియేట్ కాలనీ వాసుల స్థలాలలో ఫెన్సింగ్ వేయడం, కూల్చి వేయడం లాంటివి చేయొద్దు” అంటూ HYDRAAను హైకోర్టు ఆదేశించింది.

నల్లచెరువు వద్ద ఉద్రిక్తత:

హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన గురువారం రోజే, కూకట్‌పల్లిలోని నల్లచెరువు వద్ద HYDRAA అధికారులు కూల్చివేతలకు దిగారు.అధికారుల కూల్చివేతలను ప్రకాష్ నగర్ వాసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో HYDRAA సిబ్బందితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతో నల్లచెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana