DSports 27 Nov:గువహటి: దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఎదుర్కొన్న చారిత్రక 408 పరుగుల భారీ ఓటమి తర్వాత.. జట్టు కోచ్‌ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో “గంభీర్‌ ఇప్పుడేమంటావ్‌?” అంటూ ఆయనను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నిస్తున్నారు.

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద పరాజయం నమోదు కావడం, సొంతగడ్డపై 25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురికావడంతో గంభీర్‌ కోచింగ్‌ వ్యూహాలపై సందేహాలు మొదలయ్యాయి.పరాజయం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన గౌతమ్ గంభీర్ తన భవిష్యత్తు గురించి, జట్టు ప్రదర్శన గురించి స్పందించారు.

కోచ్‌గా గంభీర్ హయాంలో స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్‌లలో వరుసగా రెండో వైట్‌వాష్‌కు గురికావడం (గతేడాది న్యూజిలాండ్‌తో 0-3, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో 0-2) ఆయనపై ఒత్తిడిని మరింత పెంచింది.