
DSports 27 Nov:గువహటి: టీమిండియాకు చారిత్రక ఓటమి! దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ విజయంతో ప్రొటీస్ జట్టు 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
రికార్డు స్థాయిలో అతిపెద్ద ఓటమి:
పరుగుల తేడా పరంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యంత ఘోర పరాజయం.గతంలో 2004లో నాగ్‌పూర్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 342 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడగా, ఇప్పుడు ఆ రికార్డు చెదిరిపోయింది.25 ఏళ్ల తర్వాత సఫారీ విజయం భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ను గెలవడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇంతకుముందు 2000 సంవత్సరంలో హన్సీ క్రోనియే నేతృత్వంలోని జట్టు ఈ ఘనత సాధించింది.549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. ఆటగాళ్లలో కనీస పట్టుదల, సాంకేతికత లోపించినట్లు స్పష్టంగా కనిపించింది. అనవసరమైన ప్రయోగాలు, అస్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్, దూకుడు ప్రదర్శించి వికెట్లను చేజార్చుకున్న యువ ఆటగాళ్ల తీరు పరాజయానికి దారితీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చారిత్రక విజయంలో దక్షిణాఫ్రికా ఆఫ్-స్పిన్నర్ సైమన్ హార్మర్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు సహా మొత్తం 9 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ కూడా బంతితో (తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు), బ్యాట్‌తో (93 పరుగులు) సత్తా చాటాడు.
ఈ సిరీస్ ఓటమితో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దిగజారింది.
