DNews: Nov 26: కొండపాక రూరల్ పరిధిలోని కుక్నూరుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర హత్య కేసులో మామ ఖాదీర్ మరియు అతని తమ్ముడు షబ్బీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను CI లతీఫ్, SI శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చట్లపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి షాహిద్ (25) తన మామ ఖాదీర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడటం వల్ల ఖాదీర్ ఆగ్రహానికి గురయ్యాడు. షాహిద్ తల్లి ఖదేరియాను బెదిరిస్తూ “నీ కుమారుడు మారకపోతే చంపేస్తాను” అని హెచ్చరించాడు. నవంబర్ 22న షాహిద్ కుక్నూరుపల్లికి బైక్‌పై వెళ్తుండగా, చిన్ని కిష్టాపూర్ గ్రామం అవుట్‌స్కర్ట్స్ వద్ద ఖాదీర్ కారు తో వెనుక నుంచి ఢీకొట్టాడు. బైక్‌పై పడిపోయిన షాహిద్‌ను కొంత దూరం లాగి, అతను చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు షాహిద్‌ను మృతుడిగా ప్రకటించారు. ఈ సమయంలో ఖాదీర్ తమ్ముడు షబ్బీర్ ఆసుపత్రికి చేరుకుని, తన ఉద్యోగం పోతుందనే భయంతో “నేనే కారు తో ఢీకొట్టాను” అని పోలీసులను తప్పుదారి పట్టించాడు. అయితే షాహిద్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిజాన్ని బయటపెట్టి, ఖాదీర్ మరియు షబ్బీర్‌ను మంగళవారం రిమాండ్‌కు పంపించారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana