DNews: Nov 25: ఎథియోపియా దేశంలోని హెలి గుబ్బి అగ్నిపర్వతం ఆదివారం రోజున విస్ఫోటనం చెందింది. సుమారు 12 వేల సంవత్సరాల తర్వాత ఈ అగ్నిపర్వతం మళ్లీ విస్ఫోటనం చెందడం విశేషం. విస్ఫోటనం సమయంలో చిన్న భూకంపం కూడా సంభవించింది. ఈ విస్ఫోటనం కారణంగా దట్టమైన పొగ, బూడిదలు సుమారు 15 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి వెళ్లాయి. ఆ బూడిద మేఘాలు భారత ఉపఖండం వైపు ప్రయాణించి మొదట గుజరాత్‌లోకి ప్రవేశించి, తరువాత రాజస్థాన్ మీదుగా ఢిల్లీ ఆకాశంలోకి చేరాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డీజీసీఏ (DGCA) ఇప్పటికే విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. బూడిద మేఘాల కారణంగా విమాన మార్గాలను మార్చుకోవాలని, ప్రయాణంలో ఇంజిన్ పనితీరులో మార్పులు, పొగ లేదా దుర్వాసన కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది. ఈ ప్రభావంతో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సేవలు అంతరాయం కలిగాయి. వాతావరణ శాస్త్రవేత్తలు ఈ మేఘాల్లో అధిక శాతం సల్ఫర్ డయాక్సైడ్ మరియు బూడిద ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో గాలి నాణ్యతపై ప్రభావం తక్కువగా ఉంటుందని, ఎందుకంటే ఈ మేఘాలు చాలా ఎత్తులో ప్రయాణిస్తున్నాయని చెప్పారు. అయితే నేపాల్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లోని కొండలపై ఈ మేఘాలు తాకే అవకాశం ఉండటంతో అక్కడ గాలి నాణ్యత కొంత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana