
DSports 24 Nov:దక్షిణాఫ్రికాతో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. మూడో రోజు ఆటలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు భారీగా 288 పరుగుల ఆధిక్యం లభించింది.
అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో సెనురన్ ముత్తుసామి (109), మార్కో జాన్సెన్ (93) మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.9 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆది నుంచీ గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58 పరుగులు), ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (48 పరుగులు) మినహా మరే భారత బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.మి కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6) వంటి కీలక ఆటగాళ్లంతా స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో భారత్ పతనం వేగవంతమైంది.ఒక దశలో భారత్ 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ (19) కలిసి 8వ వికెట్‌కు 72 పరుగులు జోడించి పరువు నిలిపే ప్రయత్నం చేశారు.
