
DSports 24 Nov:సాంగ్లీ (మహారాష్ట్ర): భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానా ఇంట్లో వరుసగా ఎదురైన అనారోగ్య సమస్యల కారణంగా ఆమె వివాహం నిరవధికంగా వాయిదా పడింది. ఆదివారం జరగాల్సిన పెళ్లి వేడుకకు కొద్ది గంటల ముందు స్మృతి తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, ఆ తర్వాత ఆమె కాబోయే భర్త, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా పలాష్ ఆస్పత్రికి
తండ్రికి గుండెపోటు లక్షణాలు: వివాహానికి ముందు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో బాధపడడంతో వెంటనే సాంగ్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు (ఆంజినా పెక్టోరిస్) ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
కాబోయే భర్తకు అస్వస్థత: తండ్రి అనారోగ్యంతో వివాహం వాయిదా పడిన కాసేపటికే, వరుడు పలాష్ ముచ్చల్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఇన్ఫెక్షన్ మరియు ఎసిడిటీ కారణంగా అతని ఆరోగ్యం క్షీణించడంతో, ముందు జాగ్రత్తగా పలాష్‌ను కూడా సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదమేమీ లేదు: అయితే, పలాష్ ముచ్చల్‌కు వచ్చిన అనారోగ్య సమస్య తీవ్రమైనది కాదని వైద్యులు తెలిపారు. చికిత్స తీసుకున్న కొద్దిసేపటికే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి హోటల్‌కు తిరిగి వచ్చారు.
