DNews: Nov 24: హైదరాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సనత్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా మార్చాలని అభిప్రాయపడ్డారు. సోమవారం సనత్‌నగర్ బీకే గూడలో జరిగిన సీనియర్ సిటిజన్ల సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80 ఏళ్లకు పైబడిన 34 మంది సీనియర్ సిటిజన్లు, 70 ఏళ్లకు పైబడిన 32 మంది సీనియర్ సిటిజన్లను శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంలో తలసాని మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్న సీనియర్ సిటిజన్లను ప్రశంసించారు. 2014లో సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సీనియర్ సిటిజన్ల కౌన్సిల్ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ సమాజ సేవకు అంకితభావంతో కమిటీని ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. సీనియర్ సిటిజన్లు చేపడుతున్న కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్నానని, భవిష్యత్తులో కూడా అందిస్తానని స్పష్టం చేశారు. 2014 తర్వాతే సనత్‌నగర్ నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చూపించామని తలసాని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి కాలంలో కూడా సనత్‌నగర్‌లో అభివృద్ధి జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, మాజీ కార్పొరేటర్ నమనా శేషకుమారి, సనత్‌నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు దుబే, మాజీ అధ్యక్షులు పార్ధసారథి, మాణిక్ రావు పాటిల్, సభ్యులు ఆనంద్ రెడ్డి, కృష్ణ దేవ్‌గౌడ్, సాయి, నాయకులు కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నరసింహ మరియు ఇతరులు పాల్గొన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana