DNews: Nov24: సివిల్ సర్వీసెస్ అనేది చాలా మంది యువత కల. సమాజానికి సేవ చేయాలనుకునే, పేదలకు న్యాయం చేయాలనుకునే వారికి ఇది మంచి మార్గం. అందుకే లక్షలాది మంది ఈ పరీక్షకు సిద్ధమవుతారు. సంబంధిత శిక్షణ ఖరీదైనది కాబట్టి, చాలా మంది వెనక్కి తగ్గుతారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తోంది.

ఉచిత శిక్షణకు అవకాశం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రతి సంవత్సరం 20 వేల మంది విద్యార్థులు వివిధ డిగ్రీ కోర్సులను పూర్తి చేస్తున్నారు. అయితే, వారిలో 70 శాతం మంది పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారు. చాలా మంది సివిల్ సర్వీసెస్ రాయడానికి ఆసక్తి చూపుతున్నారు, కానీ ఆర్థిక కారణాల వల్ల దానిపై దృష్టి పెట్టడం లేదు. అలాంటి వారు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవచ్చు.

30న అర్హత పరీక్ష: ఈ నెల 26లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. వివరాలను https://apstudycircle.apcfss.in/లో కుల ధృవీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలి. తరువాత, అర్హత పరీక్ష ఉంటుంది. ఈ నెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. అర్హత సాధిస్తే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్‌లలో డిసెంబర్ 10 నుండి తరగతులు ప్రారంభమవుతాయి. 2025-26 సంవత్సరానికి 240 మందికి అవకాశాలు కల్పించబడతాయి.

సందేహాలు?: ఏవైనా సందేహాలు ఉంటే, వాటిని పరిష్కరించడానికి 94933 43866, 96035 57333, 98668 86844 నంబర్‌లను సంప్రదించవచ్చు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారుల కార్యాలయాలకు కూడా రావచ్చని సాధికారత అధికారులు అప్పన్న, జ్యోతి శ్రీ తెలిపారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana