
DNews: Nov 22: మక్తల్ పట్టణంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందుగా మంత్రి వాకాటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ కలిసి గోల్లపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో నిర్మించబోయే సమగ్ర గురుకుల పాఠశాల భవన సముదాయం స్థలాన్ని పరిశీలించారు. ఈ పాఠశాల సముదాయం నిర్మాణం ద్వారా స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించబడతాయి. ముఖ్యమంత్రి పర్యటనతో మక్తల్ ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.
