
DNews: Nov 22: అదిలాబాద్ వైద్య విభాగం శనివారం రోజున ‘వరల్డ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్‌నెస్ వీక్’ సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీని RIMS మైక్రోబయాలజీ విభాగం మరియు మెడికల్ విభాగం సంయుక్తంగా నిర్వహించగా, ర్యాలీ RIMS నుండి కలెక్టర్‌ఆఫీస్ స్క్వేర్ వరకు కొనసాగింది. అనంతరం RIMS డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ మాట్లాడుతూ, యాంటీబయాటిక్స్‌ను అధికంగా వాడటం ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో RIMS డిప్యూటీ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, NCD ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీధర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
