DNews: Nov 22: యెల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో శనివారం నాడు రైతులకు ఆయిల్ పామ్ సాగు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ మరియు సిరికల్చర్ శాఖ జిల్లా అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి ఆఫ్జల్ బేగం పాల్గొన్నారు. లత మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలు అందజేస్తుందని, అలాగే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను కూడా సబ్సిడీ ఆధారంగా అందిస్తున్నట్లు చెప్పారు. తోటలలో నిర్వహణ పద్ధతులు మరియు ఇతర సమస్యలను ఫీల్డ్ స్థాయిలో పరిశీలించి, తగిన సూచనలు అందజేస్తామని ఆమె అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ కృష్ణరెడ్డి, వ్యవసాయ మరియు హార్టికల్చర్ శాఖ AEOలు, గ్రామాల రైతులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana