DET:NOV 22:
మాస్క్ మూవీ రివ్యూ గ్రిప్పింగ్ హైస్ట్ థ్రిల్లర్:
కవిన్ మరియు ఆండ్రియా జెరెమియాతో తెరకెక్కిన మాస్క్ చిత్రం డార్క్ కామెడీ, హైస్ట్ థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు విక్రనన్ అశోక్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక ఎన్నికల బ్లాక్ మనీని దొంగిలించడం, దాని తర్వాత జరిగే గందరగోళం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సినిమా స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల నెమ్మదించినప్పటికీ, కథలోని అద్భుతమైన మలుపులు, పాత్రల చిత్రణ సినిమాను నిలబెట్టాయి.

మెప్పించిన గ్రే షేడ్స్ పాత్రలు:

ఈ సినిమాకు ప్రధాన బలం ఏంటంటే ఇందులోని ప్రధాన పాత్రలన్నీ గ్రే షేడ్స్ కలిగి ఉండటం. అంటే హీరో-హీరోయిన్ అనకుండా ప్రతి పాత్రలో మంచి-చెడు కలగలిసి ఉంటాయి. కవిన్ పోషించిన వేలు పాత్ర స్వార్థపరుడు, మోసగాడు, డబ్బు కోసమే పనిచేస్తాడు. అయినప్పటికీ కవిన్ తన నటన, కామెడీ టైమింగ్‌తో ఈ పాత్రను ఆకట్టుకునేలా చేశాడు. ఇక ఆండ్రియా జెరెమియా పోషించిన భూమి పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పైన ఎన్.జి.ఓ. నడుపుతూ, లోపల రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు సంబంధించిన చీకటి వ్యవహారాలు చూసుకుంటుంది. ఆండ్రియా నటన ఆమె పాత్రలోని క్రూరత్వం ఈ సినిమాకే హైలైట్. రుహాని శర్మ, చార్లీ వంటి సహాయ నటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

ఊహించని ట్విస్టులు క్లైమాక్స్:
మాస్క్ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే కథనంలో వచ్చే అనూహ్యమైన మలుపులు. ఇంటర్వెల్‌కి వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడిని షాక్‌కి గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మరింత పెద్దదిగా, బోల్డ్‌గా ఉండటం సినిమాకి ప్లస్ పాయింట్. ఈ ట్విస్టులు సినిమాకు మంచి కిక్ ఇచ్చాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, ముఖ్యంగా ‘కన్నుముళి’ మరియు ‘వెట్రి వీరనే’ వంటి పాటలు సన్నివేశాలకు తగ్గట్టుగా బాగున్నాయి.

ఒక్కసారి చూడదగిన థ్రిల్లర్:

మొత్తం మీద చూస్తే, మాస్క్ ఒక ప్యాసబుల్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. కవిన్ ఆండ్రియా జెరెమియా నటన అలాగే ధైర్యంగా చూపించిన గ్రే షేడ్స్ పాత్రలు ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ట్విస్టులు సినిమాకు అదనపు బలం. స్క్రీన్ ప్లేలో ఉన్న చిన్నపాటి లోపాలను పక్కన పెడితే ఊహించని మలుపుల కోసం ఈ సినిమాను థియేటర్‌లో ఒక్కసారి తప్పకుండా చూడవచ్చు.