
DSports 21 Nov :టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఒక పాత సంఘటనను తాజాగా వెల్లడించారు. 2016లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు, చోప్రా ఒక విశ్లేషకుడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ షార్ట్ బాల్‌కు ఇబ్బంది పడతాడని అంచనా వేశారు.
ట్రోల్: చోప్రా విశ్లేషణను తప్పుగా నిరూపిస్తూ, మొయిన్ అలీ ఆ సిరీస్‌లో సెంచరీ కొట్టాడు. అంతేకాదు, ఆ రోజు సాయంత్రం చోప్రా కెరీర్ గణాంకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేశాడు!
చోప్రా రియాక్షన్: సహ క్రికెటర్ ట్రోల్ చేయడంతో చోప్రా కూడా రిప్లై ఇచ్చాడు, తన విశ్లేషణలో తప్పేమీ లేదని, విశ్లేషణ చేయడమే తన పని అని బదులిచ్చాడు.
క్షమాపణ: అయితే, మరుసటి రోజు భారత్ నిజంగానే షార్ట్ బాల్ వ్యూహంతో మొయిన్‌ను ఔట్ చేసింది. ఆ తర్వాత, మొయిన్ అలీ స్వయంగా చోప్రా దగ్గరకు వచ్చి, “క్షమించండి. నేను అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. నేను చేసింది తప్పే” అని చెప్పి క్షమాపణలు చెప్పాడు.
చోప్రాను ట్రోల్ చేసింది మొయిన్ అలీ, కానీ తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పింది కూడా మొయిన్ అలీనే!
