DSports 19 Nov :టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ కోల్‌కతా పిచ్‌పై వస్తున్న విమర్శలు, టీమ్ ఇండియా నలుగురు స్పిన్నర్లను ఆడించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అందులో తప్పేమీ లేదు” అంటూ జట్టు, కోచ్‌కు మద్దతుగా నిలిచారు.

స్పిన్ పిచ్‌లపై స్పందన:

“భారత్‌లో స్పిన్ పిచ్‌లు సిద్ధం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది.”

“టీమిండియా గెలుస్తున్నంత వరకు ఎవ్వరూ ఈ విషయంపై ప్రస్తావన కూడా తెచ్చేవారు కాదు.”

ఓటమి గురించి:

“గెలుపోటములు ఆటలో సహజం. ఇంతకు ముందు భారత జట్టు ఎప్పుడూ ఓడిపోకుండా లేదు.. అలాగే ఇదే తొలి ఓటమి అని కూడా కాదు.”

“నా దృష్టిలో ఈ ఓటమితో అంతగా బాధ పడాల్సిన అవసరమైతే లేదు.”

నలుగురు స్పిన్నర్ల వ్యూహం:

“పిచ్ స్పిన్‌కు అనుకూలంగా తయారైనప్పుడు నలుగురు స్నిన్నర్లను (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్) ఆడించడంలో తప్పేముంది?”

“అది టర్నింగ్ ట్రాక్. మ్యాచ్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే నలుగురు స్పిన్నర్లు ఆడాల్సిన పిచ్ అది. కాబట్టి అందులో తప్పేమీ లేదు.”

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ & ఐపీఎల్:

శుభ్‌మన్ గిల్ కొత్తగానే కెప్టెన్సీ చేపట్టాడు. అతనికి కొంచెం విశ్రాంతి అవసరం, మానసికంగా, శారీరకంగా రెస్ట్ తీసుకోవాలి.

ఐపీఎల్ (IPL) వల్ల గత పదేళ్లలో టీమిండియా బౌలింగ్ విభాగం మెరుగుపడింది. ఐపీఎల్ అనుభవం బౌలర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ లీగ్ వల్ల టీమిండియాకు కొత్త బౌలర్లు దొరుకుతారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana