DET:NOV 19:
మణిరత్నం క్లాసిక్‌తో అద్భుతమైన ఆరంభం:
గిరిజా శెట్టర్ తెలుగులో తన సినీ ప్రస్థానాన్ని 1989లో మణిరత్నం దర్శకత్వం వహించిన రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’ చిత్రంతో ప్రారంభించారు.ఈ సినిమాలో ఆమె నాగార్జున సరసన నటించారు.తన చురుకైన,ఆధునిక,స్వేచ్ఛాయుతమైన పాత్రతో గిరిజ రాత్రికి రాత్రే సంచలనంగా మారారు.ఈ సినిమా తెలుగు రొమాంటిక్ జానర్‌ను మలుపు తిప్పింది.ఆ కాలంలో కథానాయిక పాత్రల చిత్రణకు ఆమె నటన ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది.

మోహన్‌లాల్‌తో విజయం ఆమీర్ ఖాన్ చిత్రం కోల్పోవడం:

తెలుగులో మంచి విజయం సాధించిన తర్వాత గిరిజ మలయాళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్‌తో కలిసి వందనం అనే హిట్‌ సినిమాలో నటించారు.ఆ తర్వాత,ఆమె బాలీవుడ్‌లో పెద్ద అడుగు వేయాలని అనుకున్నారు.ఆమీర్ ఖాన్ సరసన జో జీతా వోహీ సికిందర్ సినిమాలో కథానాయికగా ఎంపికయ్యారు.అయితే మొదటి షెడ్యూల్ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె లండన్‌కు వెళ్లాల్సి వచ్చింది.దీంతో ఆ సినిమాలో ఆమె స్థానంలో వేరొకరిని తీసుకున్నారు.ఆర్థిక సమస్యల కారణంగా మోహన్‌లాల్‌తో కలిసి చేయాల్సిన మరో మలయాళ చిత్రం ధనుష్కోడి కూడా మధ్యలోనే ఆగిపోయింది.

సినీ ప్రపంచం నుండి దూరం మళ్లీ చూడటం మానేయడం:

వరుసగా ఎదురైన ఈ ఎదురుదెబ్బలతో గిరిజ శెట్టర్ నిరాశ చెందారు.పూర్తిగా భారతదేశాన్ని వదిలి వెళ్లారు.మళ్లీ సినిమాలు చూస్తే పాత విషయాలు అవకాశాలు కోల్పోయిన బాధ గుర్తుకొస్తాయేమోనని భయపడి,చాలా ఏళ్లపాటు భారతీయ చిత్రాలను చూడటం మానేశానని ఒక ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.ఆమె నటించిన రెండో తెలుగు చిత్రం హృదయాంజలి కూడా ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన చాలా కాలం తర్వాత అంటే 2002లో విడుదలైంది.

సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం:

దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత గిరిజ శెట్టర్ 2024లో కన్నడ చిత్రం ఇబ్బని తబ్బిద ఇలేయాలి ద్వారా మళ్లీ నటనలోకి అడుగుపెట్టారు.ఇది ఆమెకు సినీ ప్రపంచంలోకి ఒక నిశ్శబ్ద పునరాగమనాన్ని సూచిస్తుంది.